రాఘవులు గారూ, జాలిం లోషన్ వాడండి ...
శ్రీ బోడపాటి వెంకట రాఘవులు (B.V. రాఘవులు) గారికి,
అయ్యా,
మీలాంటి ఎందరో మహానుభావుల వలన, మా తాతల కాలం లో సిద్ధాంత నిభద్దత కి మారు పేరయిన కమ్యూనిస్టులు నేడు రాద్ధాంత ప్రభుద్దులు గా మారిపోయారు. ప్రజలే మాకు ముఖ్యం, పోరాటమే మా తత్త్వం, సమ సమాజమే మా లక్ష్యం అని భావించాల్సిన మీరు మా మాటే మాకు ముఖ్యం, ఆరాటమే మా తత్వం, అధికారమే మా లక్ష్యం అనే రాజకీయ వ్యభిచారులు గా మారి పోయారు. గాలి వాటం, ఏ ఎండకా గొడుగు లాంటివి బాగా వంటపట్టించుకుని అధికారానికి ఉంపుడుగత్తెలు గా పరిణామం చెందారు.
లేకపోతే, అతి పెద్ద వర్గ తారతమ్యాలు సృష్టించిన తెలుగు దేశం తోను, చిన్నరాష్ట్రాలకు వ్యతిరేకం అనే మీ మూల సిద్ధాంతాలను వదిలేసి తె.రా.స. తోను కూటమి కట్టటం ఏమిటి? సిద్ధాంతాలే ప్రాణం గా భావించి పోరాటం చేయాల్సిన మీరు కాంగ్రెస్సుని ఓడించటమే మా లక్ష్యం అని చెప్పటం ఏమిటి? 'సామాజిక న్యాయం' మా ఎజెండా అన్న చిరంజీవి పార్టీ ని కనీసం పట్టించుకోకుండా, 'మా సామాజిక వర్గానికే న్యాయం' అనే పార్టీల తో పొత్తులు పెట్టుకోవటం ఏమిటి?
0 comments:
Post a Comment