'చంద్రు'నికో చక్రం
అపర చాణుక్యులు, ఆంధ్ర ex. CEO
శ్రీ చంద్ర బాబు నాయుడు గారికి.
అయ్యా ,
మీరు రాష్ట్రం లో మరియు కేంద్రములో చక్రం బాగా తిప్పి అలసినారని తెలుగు ప్రజలు
మీకు విశ్రాంతి కలిపించారు. కనీసం కేంద్రం లో కూడా అవకాశం దొరకనివ్వ లేదు.
కాని మీకు విశ్రాంతి కంటే చక్రం తిప్పటం చాల మక్కువ అని తెలిసిన వాడిని నేను. అందుకే
మీరు ఈ అయిదు సంవత్సరాలు ఖాళీగా కూర్చోకుండా మీకు ఉడతా భక్తిగా ఈ చిన్న
చక్రం సమర్పించు కుంటున్నాను.
ఎప్పటి లాగే ప్రతిపక్ష భాద్యత ను మీ రాజగురువు కి అప్పగించండి. మీ బాబు లోకేష్ కి
వేరే దేశాల నుంచి అమలు సాధ్యం కాని పధకాలు తెలుసుకుని రమ్మనండి. మీ బావ మరుదులను,
వారి పిల్లలని ఊరిమీదకు తొడలు కొట్టడానికి పంపండి. మీరు మాత్రం హాయి గా ఈ చక్రం తో రోజంతా
ప్రాక్టీస్ చేసి, రాత్రంతా అధికారం మీదే అని కలలు కనండి. ఏమో, 2014 నాటికి మీకు ప్రజలు ఎంత పెద్ద
చక్రం ఇస్తారో ?
0 comments:
Post a Comment